ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (22:14 IST)

'జైలర్‌ 2'లో నందమూరి హీరో.. రజనీకాంత్‌తో స్క్రీన్ షేరింగ్..?

Jailer
ప్రముఖ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో 'జైలర్‌ 2'కి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి "హుకుమ్" అనే టైటిల్ పెట్టవచ్చని అంచనాలు ఉన్నాయి. 
 
అదనంగా, ఈ సీక్వెల్‌లో తెలుగు స్టార్ హీరో నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ "జైలర్"లోనే ఆ హీరో నటించాల్సిందని.. ఆ ఛాన్స్ మిస్ కావడంతో జైలర్ 2లో ఆ హీరో తప్పకుండా నటించాలనే పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది. 
 
ఆ నటుడు మరెవరో కాదు నందమూరి హీరో బాలకృష్ణ. నెల్సన్ "జైలర్"లో అతన్ని పోలీసుగా నటించాలని అనుకున్నారు. అయితే అప్పట్లో బిజీ షెడ్యూల్ కారణంగా బాలకృష్ణ ఆ పాత్రకు కమిట్ కాలేదు. కానీ నందమూరి బాలకృష్ణ "జైలర్ 2" లో భాగం అవుతాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 
 
రజనీకాంత్‌తో స్నేహంతో పాటు బాలకృష్ణకు తమిళనాడులో గణనీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఛాన్సును ఉపయోగించుకుని రజనీకాంత్ జైలర్ 2లో కనిపించేందుకు బాలయ్య బాబు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.