1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. sai dharam tej pawan kalyan andhra pradesh chiranjeevi allu arjun pupshpa 2 set

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైనవారి చేతుల్లో సేఫ్‌గా వుంది - పుష్ప సెట్లో ఆనంద హేళ !

pawan kalyan  with child (AP)
pawan kalyan with child (AP)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు మరింత ఆనందంలో మునిగిపోయారు. అలాంటిది కుటుంబ సభ్యుల సంగతి సరేసరి. టీవీల్లో రిజల్ట్ వివరాలు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి  ఆనంధాన్ని పట్టలేకుండా వున్నామని సన్నిహితులు తెలియజేస్తున్నారు.
 
మరి బాబాయ్, మామయ్య వరుసఅయ్యేవారి పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకో వచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈరోజు హైదరాబాద్ శివార్లలో రిసార్ట్ లో పుష్ప సీక్వెల్ షూట్ జరగనుంది. సాయంత్రం జరుగుతున్న ఈ షూట్ లో సక్సెస్ కేక్ ను కట్ చేయడానికి చిత్ర యూనిట్ కేక్ ను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది.
 
ఇక సాయిధరమ్ తేజ్ అయితే, వపన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడిని ఎత్తున్న ఫొటోను షేర్ చేసి తగిన కాప్షన్ పెట్టి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత & భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది అని పేర్కొన్నారు. దీనికి సోషల్ మీడియాలో అవును నిజమే.. అంటూ ఆనందంతో స్పందిస్తున్నారు.
About Writer
డీవీ
తర్వాతి కథనం
ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు పవన్ కల్యాణ్ గారూ: అల్లు అర్జున్