సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (11:43 IST)

ఏపీ లోక్‌సభ ఎన్నికలు : ఎంపీ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి ముందంజ!!

voters
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతుంది. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుంది. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టీడీపీ), అనకాపల్లిలో సీఎం రమేశ్‌ (బీజేపీ), రాజమహేంద్రవరంలో దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ), విజయవాడలో కేశినేని చిన్ని (టీడీపీ) ముందంజలో ఉన్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ), నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార వైకాపా మాత్రం కడప, తిరుపతి, రాజంపేట, అరకు లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : కౌంటింగ్ కేంద్రం నుంచి జారుకున్న కొడాలి నాని!  
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళుతుంది. మొత్తం 175 సీట్లకు గాను ఈ కూటమి 153 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి మెల్లగా జారుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .