1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (12:03 IST)

దాసరి నారాయణ వర్థంతి.. తాత మనవడుతో వచ్చారు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో..

Dasari
దర్శకరత్న, దాసరి నారాయణ వర్థంతి నేడు. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి..  250కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా దాసరి వ్యవహరించారు. అత్యధిక సినిమాలకు దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకున్నారు. 
  
దాసరి అంటే.. ఆయన తీసిన మంచి మంచి సినిమాలను గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. దాసరిలో ఒక పెద్దమనిషిని చూస్తారు సినిమా వాళ్లు. దాసరి లోటు ప్రేక్షకులకే కాదు.. పరిశ్రమకు కూడా తీరలేదు. ఇప్పట్లో తీరేలా కూడా లేదు.
 
దక్షిణ భారత సినీరంగ కేసరి- దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శక రత్న, నిర్మాత, కథా రచయిత, మాటలు-పాటల రచయిత, నటుడు, జర్నలిస్ట్, ప్రముఖ పత్రికాధిపతి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన దాసరి 1974లో 'తాత మనవడు' చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఆపై దాసరి నారాయణ రావు ఎన్నో విజయవంతమైన చిత్రాలను చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం..