మార్గదర్శి దాసరిగారిని తలచుకున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తనకు మార్గదర్శి అయిన దాసరి నారాయణరావుని తలచుకుంటూ పోస్ట్ చేశాడు. మే3వ తేదీన విమానంలో అమెరికా పయనం అయిన ఫొటోలను పెట్టి చాలా కాలం తర్వాత విదేశాలకు వెలుతున్నట్లు పోస్ట్ చేసిన చిరంజీవి తన గురువు దాసరినారాయణరావు జయంతి మే4వ తేదీన ఉండలేకపోతున్నందుకు బాధగా వుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా దాసరినారాయణావు తనను చేయి పట్టుకుని తీసుకువెళుతున్న ఫొటోను పెట్టారు. ఇది దాసరిగారి చివరిదశలో వున్నట్లు తెలిసిపోతుంది. దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి ఆపద్బంధువు, నాకు మార్గదర్శి, ఆప్తులు... forever living in our hearts దాసరి గారిని జన్మదినోత్సవం నాడు స్మరించుకుంటూ .. అంటూ కాప్టన్ పెట్టారు. ఇందుకు ఆయన అభిమానులు విదేశాలకు వెళుతున్నా ఇక్కడి విషయాలను మర్చిపోలేదని కామెంట్ చేస్తున్నారు.