సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (14:52 IST)

భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లిన చిరంజీవి

chirusurekha
ఇటీవల "ఆచార్య"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇపుడు తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి తర్వాత ఆయన విదేశాలకు వెల్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
"పాండమిక్ తర్వాత తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చిన్న హాలిడే తీసుకుని సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత యూఎస్, యూరప్‌లకు వెళుతున్నాం. త్వరలోనే అందరినీ కలుస్తాను" అంటూ కామెంట్స్ చేశారు. ఆ సందేశంతో పాటు సురేఖతో ఫ్లైట్‌లో కలిసివున్న ఫోటోను సైతం చిరంజీవి షేర్ చేశారు. 
 
ఈ పోస్ట్‌పై మెగా కోడలు ఉపాసన కొణిదెల స్పందించారు. హ్యాపీ టైమ్ అత్తయ్య మామయ్య అంటూ కామెంట్ చేశారు. ఇక చిరంజీవి ఫాలోయర్స్, అభిమానులు కూడా హ్యాపీ జర్నీ అంటూ విసెష్ చేశారు. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రం అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు.