మంగళవారం, 4 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 3 నవంబరు 2025 (16:10 IST)

Mohan Babu: డా. ఎం. మోహన్ బాబు కి MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ గ్రాండ్ ఈవెంట్

Dr. M. Mohan Babu
Dr. M. Mohan Babu
ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణు మంచు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఐదు దశాబ్దాలుగా డాక్టర్ మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. తన శక్తివంతమైన ప్రదర్శనలు, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంటుంది. 600కి పైగా చిత్రాల్లో అతని బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటుతాయి.
 
MB50 అంటే కేవలం సినీ విజయాలే కాకుండా.. కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధతను కూడా సూచిస్తుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఒంటరిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్న విలక్షణ నటుడుగా ఎదిగిన ఈ జర్నీగురించి అందరికీ మరోసారి చాటి చెప్పబోతోన్నారు.
 
డాక్టర్ మోహన్ బాబు ఇలా ఇండస్ట్రీలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విష్ణు మంచు నిర్వహించబోతోన్న ఈ ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ కార్యక్రమానికి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలోనే వెల్లడించనున్నారు.