#BiggBossTelugu3 లేటెస్ట్ ప్రోమో.. దమ్ముంటే రండ్రా అంటోన్న బాబా భాస్కర్ (వీడియో)
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కి ఏడుగురు నామినేట్ కావడంతో మంగళవారం నాటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఒక టాస్క్ ఇచ్చారు.
విక్రమ్ పురి, సింహాపురి అని రెండు రాజ్యాలుగా హౌస్ ని విడగొట్టి గుడ్ల కోసం కొట్లాట పెట్టారు. రెడ్ టీంకి లీడర్‌గా శ్రీముఖిని పెట్టగా.. బ్లూ టీంకి లీడర్‌గా హిమజను నియమించారు. ఇక జెండాల కోసం, గుడ్ల కోసం ఒకరిపై ఒకరు పడుతూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ యాక్షన్ ఫీట్లు చేశారు.
ఈ గేమ్‌లో చాలా మందికి గాయాలు కాగా.. మహిళా కంటెస్టెంట్స్ తో మేల్ కంటెస్టెంట్స్ ఆడేసుకున్నారు. గేమ్ ని సిల్లీగా తీసుకుంటున్నారు కాబట్టి వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. తాజాగా బిగ్ బాస్ నుంచి ప్రోమో విడుదలైంది.
ఆ ప్రోమోలో బాబా భాస్కర్ దమ్ము రే రండ్రా అంటూ ఓ సింహాసనంపై కూర్చుని పిలుపు నిస్తున్నాడు. వితిక, వరుణ్, పునర్నవిలను వరుసగా పిలిచాడు. ప్రస్తుతం ప్రోమో Dragon war with #BabaBhaskar అనే పేరిట ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రోమో వీడియోను మీరూ ఓ లుక్కేయండి.