మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:16 IST)

సమంత శాకుంతలంలో ఈషా రెబ్బా..

మంచి నటిగా, గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటోంది హీరోయిన్ ఈషా రెబ్బ. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ రూపొందించనున్న `శాకుంతలం`లో ఓ మంచి రోల్ ఈషాకు లభించిందట. ఈ సినిమాలో సమంత స్నేహితురాలి పాత్రలో ఈషా కనిపించనుందట. 
 
భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో గుణశేఖర్ రూపొందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో కనిపించబోయే నటీనటుల గురించి చిత్రయూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతోంది.
 
కాగా `లస్ట్ స్టోరీస్`కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్‌తో ఈషా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా ఓ హాట్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.