సాయిపల్లవిపై కన్నేసిన స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టారు కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్నాను తీసుకున్నారు. మరో హీరోయిన్ (హీరోకు చెల్లి)గా సాయిపల్లవి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
నిజానికి సాయిపల్లవి అంత ఈజీగా సినిమాలు అంగీకరించరు. ఒక సినిమాకు పచ్చజెండా ఊపేముందు చాలా ఆలోచిస్తుంది. తన పాత్ర నచ్చకపోతే ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. అందుకే, ఆమెను ఒక సినిమాలో బుక్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సాయిపల్లవి తాజగా అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకుందంటూ టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
ఇప్పుడీ చిత్రంలోనే సాయిపల్లవి నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. పైగా, ఈ చిత్రంలో ఆమె హీరోకి చెల్లిగా నటిస్తుందని, ఇది చాలా కీలక పాత్ర అనీ ప్రచారం జరుగుతోంది. మరి, ఓపక్క ఇతర సినిమాలలో కథానాయికగా నటిస్తున్న సాయిపల్లవి.. ఇలా హీరోకి చెల్లిగా నటిస్తుందా? ఆ పాత్రలో అంత విషయం వుందా? అన్నది త్వరలో వెల్లడవుతుంది.