సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:44 IST)

బుట్టబొమ్మ హిట్‌కు డేవిడ్ వార్నరే కారణం.. అల్లు అర్జున్

"అల వైకుంఠపురంలో" సినిమా పాటలు బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2020 ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాట, దానికి బన్నీ వేసిన స్టెప్పులు ఇతర భాషల వాళ్లని కూడా అలరించాయి. బుట్ట బొమ్మ పాటకు ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ దక్కింది. 
 
ఈ నేపథ్యంలో`బుట్టబొమ్మ` పాట అంతగా విజయవంతమవడానికి అస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కారణమని బన్నీ తాజాగా చెప్పాడు. సమంత హోస్టింగ్ చేస్తున్న `సామ్ జామ్' షోలో బన్నీ పాల్గొన్నాడు. కొత్త సంవత్సరం కానుకగా ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌కు వచ్చింది. 
 
ఈ సందర్భంగా బుట్టబొమ్మ పాట గురించి బన్నీ స్పందించాడు. ఆ పాట అంత సక్సెస్ కావడంలో యూనిట్ సభ్యులకు ఎంత క్రెడిట్ ఉందో అంతే సమానమైన క్రెడిట్ వార్నర్‌కు కూడా ఉంది. టిక్‌టాక్ ద్వారా ఆ పాటను వార్నర్ వైరల్ చేశాడు. ఇటీవల జరిగిన సిరీస్ సందర్భంగా స్టేడియంలో కూడా వార్నర్ `బుట్టబొమ్మ` స్టెప్ వేయడం ఆశ్చర్యం కలిగించింద`ని బన్నీ పేర్కొన్నాడు.