గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన
నటి రష్మిక ఇటీవలే గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆమెతోపాటు ముగ్గురు స్నేహితులు కూడా వున్నారు. కిస్ ఇస్తూ.. ప్యాన్స్‌కు ఉత్సాహపరిచేవిధంగా వుంది. రష్మిక న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్ళింది. అక్కడ సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి చేసిన సందడికి సంబంధించి వీడియో షేర్ చేసింది. ఇది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే కన్నడలో ధృవ్ హీరోగా చేసిన పొగరులో ఆమె నటించింది. ఆ సినిమా డైలాగ్‌లకు విపరీతమైన స్పందన వచ్చింది. పక్కా మాస్‌తో కూడిన హీరోగా ధృవ్ కన్పిస్తాడు. మొరటోడు, సంతకం చేయడం రానివాడుని తను ఎలా ప్రేమించి అనేది కథ. ఇక తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో రష్మిక పాత్ర కొత్తగా ఉండనుంది.
మరోవైపు పీరియాడికల్ స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. వికాస్‌భల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోను రష్మిక నటిస్తుంది.ఇందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించనుంది.తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం.