1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Regina Cassandra to play a dual role in Soorpanagai

'శూర్పణగై'గా వస్తోన్న రెజీనా.. హిట్ కొడుతుందా?

Regina Cassandra
Regina Cassandra
ప్రముఖ నటి రెజీనా విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. తన కెరీర్‌ పరంగా బ్రేక్‌నిచ్చి సినిమా ''పిల్లా నువ్వులేని జీవితం' అయితే, అడవిశేష్‌తో నటించిన 'ఎవరు' సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రను పోషించి అందరి ప్రశంసల్ని పొందారు. ఆమె తాజాగా ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. 
 
ఈ సినిమాకు తెలుగులో 'నేనేనా' అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళంలో 'శూర్పణగై' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హర్రర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా 'శూర్పణఖ'గా నటిస్తోంది. ఇందులో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందని టాక్. 
 
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. ఎప్పటినుంచో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రెజీనా... ఈ చిత్రం ద్వారా మళ్లీ హిట్‌ కొడుతుందేమో చూడాలి.
తర్వాతి కథనం
''తలైవి'' అప్డేట్: కంగనాకి ఆ చీర సీన్ తెగ నచ్చేసిందట.. మరి బోల్డ్‌గా..? (video)