సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 మే 2022 (19:06 IST)

బ్రెస్ట్ కేన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ భరిస్తున్నా: అనుభవాన్ని పంచుకున్న నటి

Chhavi Mittal
కేన్సర్ మహమ్మారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. కేన్సర్ ప్రాధమిక దశలో గుర్తించడంలో చాలామంది విఫలమవుతుంటారు. ఫలితంగా అది ప్రాణాపాయంగా మారుతుంటుంది.

 
ఇటీవలే తనకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది బుల్లితెర నటి ఛవి మిట్టల్. ఇపుడు తనకు రేడియేషన్ థెరఫి చికిత్స సాగుతోందని పేర్కొంది. ఈ చికిత్స వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ భరించక తప్పదనీ, ఆ చికిత్స అంత సౌకర్యవంతమైనది కాదని చాలామంది తనకు చెప్పారని పేర్కొంది. ఏదేమైనప్పటికీ కీమో లేదా రేడియేషన్ థెరఫీ ఏదో ఒకటి చేయించుకునేందుకు అనుమతి పత్రంపై సంతకం చేయడం తప్ప మనం చేసేదేమీ లేదని ఆమె వెల్లడించింది.

 
వైద్యులు ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు తప్ప సైడ్ ఎఫెక్ట్స్ గురించి వారు పెద్దగా ఆలోచించరని కూడా తెలిపింది. తను జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ఆమె.. చికిత్స సమయంలో తనకు ధైర్యం చెపుతూ వెన్నంటి వుంటున్న వైద్యులకు కృతజ్ఞతలు అని పేర్కొంది.