1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Faria Abdullah Belly Dance video viral in social media

ఫరియా అబ్ధుల్లా బెల్లీ డ్యాన్స్ (వీడియో వైరల్)

Faria Abdullah
Faria Abdullah
డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. 
 
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది.
 
ఈ మూవీ తర్వాత ఫరియాకు అంతగా అవకాశాలు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
 
మొదటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఫరియా గతంలోనే చెప్పుకొచ్చింది. తాజాగా బెల్లీ డాన్స్‏తో అదరగొట్టింది ఈ చిన్నది. నాభి అందాలను చూపిస్తూ బెల్లీ డాన్స్ సూపర్బ్‏గా చేసింది. 
 
ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు...మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 
తర్వాతి కథనం
తెల్లపిల్ల తమన్నా చేతిలో రెండు కోట్ల రూపాయల వజ్రం.. ఎవరిచ్చారో తెలుసా?