శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (14:39 IST)

మలయాళంలో ఫిదా.. సాయిపల్లవిని మలర్‌గా తెలుసు.. వరుణ్ తేజ్ బన్నీలా?

దర్శకుడు శేఖర్ కమ్ములకు హిట్ సంపాదించిపెట్టిన హ్యాపీడేస్ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాకుండా మలయాళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా మలయాళ వర్షెన్ కూడా సూపర్ హిట్టయ్యింది. తాజాగా శేఖర్ కమ్ముల ఫిద

దర్శకుడు శేఖర్ కమ్ములకు హిట్ సంపాదించిపెట్టిన హ్యాపీడేస్ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాకుండా మలయాళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా మలయాళ వర్షెన్ కూడా సూపర్ హిట్టయ్యింది. తాజాగా శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటూ చూపాడు. వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అందరినీ ఫిదా చేసింది. 
 
ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలో అదే పేరుతో డబ్బింగ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ హ్యాపీడేస్ అన్న టైటిల్‌తో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సాయిపల్లవి మలయాళంలో ఓ రకంగా టాప్ హీరోయిన్ కావడంతో పాటు.. ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రను మలయాళ ప్రేక్షకులు ఏమాత్రం మరిచిపోరు. దీంతో పాటు ఫిదాకు ఆమే హీరోయిన్ కావడం ద్వారా ఈ సినిమా మలయాళంలోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంటుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
సినిమా మలయాళ రైట్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వేరేవరికీ ఇవ్వకుండా తనే డబ్బింగ్ చేయించారు. ఇప్పటికే మెగా హీరో అల్లు అర్జున్‌కు, చెర్రీకి మలయాళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అదే బాటలో వరుణ్ తేజ్ వెళ్తున్నాడు. మరి మలయాళ ప్రేక్షకులు వరుణ్ తేజ్ సినిమాకు ఫిదా అవుతారో లేదో చూడాలి.