శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 2 నవంబరు 2017 (18:26 IST)

వామ్మో అంత రేటా...? పద్మావతి 'పిచ్చి'లో అమెజాన్‌...

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అయ్యింది. దీపికా పదుకునే అనగానే ఘాటు సీన్లుంటాయని అనుకున్నారు. పైగా సంజయ్ లీలాబన్సాలీ చిత్రం అనగానే ఆయన ఏదో మ్యాజిక్ చేసి సినిమా ఆడేట్లు చేస్తారనే టాక్ కూడా వచ్చింది.

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అయ్యింది. దీపికా పదుకునే అనగానే ఘాటు సీన్లుంటాయని అనుకున్నారు. పైగా సంజయ్ లీలాబన్సాలీ చిత్రం అనగానే ఆయన ఏదో మ్యాజిక్ చేసి సినిమా ఆడేట్లు చేస్తారనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ చిత్రం ట్రెయిలర్ విడుదల కాగానే సీన్ మారిపోయింది. దీపికా పదుకునే యాక్టింగ్ సీన్స్ చూసి స్టన్ అయ్యారు చాలామంది. 
 
పద్మావతి ట్రైలర్ చూసిన తర్వాత ఆ చిత్రం రైట్స్ కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇదిలావుండగానే ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ హక్కుల్ని అమెజాన్ భారీ రేటుతో కొనుగోలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ. 25 కోట్లతో చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ కొనుగోలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ఇక దీపికా పదుకునే నిలువదేమో మరి?