ఆ ముగ్గురిని ఎవరు హత్య చేశారు : దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్
తమిళనాడు స్టార్ హీరో, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతితో ఇటు సినిమా, అటు రాజకీయ రంగాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే విజయకాంత్‌ను ఎవరో హత్య చేశారని మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేయగా అవి కాస్తా వివాదాస్పదంగా మారాయి.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్‌ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా.. కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని మీరు రాజకీయాలలోకి రావాలి అని నేను చెప్పాను.
కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి.
ఇప్పటికే ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్ గారిని.. మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. వాళ్లను పట్టుకోవాలని. ఒకవేళ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే.. మిమ్మల్ని లేదా స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తారు. 'నీరం' సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. గుర్తుందా?
ఐ ఫోన్ సెంటర్‌కు కాల్ చేసి 15 నిమిషాల్లో బ్లాక్ కలర్‌లో ఉన్న ఐఫోన్‌ను తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా.. మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా.. మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్' అని అల్ఫోన్స్ పోస్ట్ చేశారు.