మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (09:17 IST)

తమిళ సీనియర్ హీరో విజయకాంత్ ఇకలేరు..

vijayakanth
తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ (70) ఇకలేరు. ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని మియోట్ హాస్పిటల్‌లో  కరోనా తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన పార్థివదేహం ఉన్న మియాట్ ఆస్పత్రితో సహా ఆయన నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 
 
ఆయన ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయిన విజయ్‌కాంత్.. శ్వాస ఇబ్బందులతో  విజయ్ కాంత్ బుధవారం మరోసారి ఆస్పత్రిలో చేర్పించారు. రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుతారని తెలిపిన కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి అధికారికంగా వెల్లడించింది. 
 
కాగా, ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులున్నారు. తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా విజయ్ కాంత్ గుర్తింపు పొందారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు. 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పేరుతో పార్టీని స్థాపించారు.