1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (10:32 IST)

యాంకర్ మదిరా బేడీ భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో మృతి

బాలీవుడ్ నటి, ప్రముఖ యాంక‌ర్ మందిరా బేడి భ‌ర్త రాజ్ కౌశ‌ల్ బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూశారు. రాజ్ కౌశల్ నిర్మాత‌గానే కాదు, ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. 
 
రాజ్ కౌశ‌ల్ మృతిపై బాలీవుడ్ వ‌ర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు 'మ‌న్మ‌థుడు', ప్ర‌భాస్ 'సాహో' చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. 
 
రాజా కౌశల్ - మందిరా బేడీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ చిన్న పిల్లలే కావడం గమనార్హం.