1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (12:52 IST)

సల్మాన్‌కు మహిళా కమిషన్ హెచ్చరిక.. మా ఎదుటకు రాకుంటే తీవ్ర పరిణామాలు!

సినిమా షూటింగ్ అయిన తర్వాత తన పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉందని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై యావత్ మహిళా ప్రపంచం మండిపడిన సంగతి తెలిసిందే. అతడు ఎందుకలా అన్నాడో చెప్పాలంటూ ఒక లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన

సినిమా షూటింగ్ అయిన తర్వాత తన పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉందని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై యావత్ మహిళా ప్రపంచం మండిపడిన సంగతి తెలిసిందే. అతడు ఎందుకలా అన్నాడో చెప్పాలంటూ ఒక లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమారమంగళం అన్నారు. మహిళలను అవమానించే రీతిలో మాట్లాడిన అతడు క్షమాపణ చెప్పాలని పలు సంస్థలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. కానీ సల్మాన్ ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్యానెల్ తుది హెచ్చరికలు జారీ చేసింది. 
 
తమ ముందుకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావాలని, ఇదే చివరి అవకాశం అని హెచ్చరిస్తూ సమన్లు పంపించింది. సమన్లను పంపించినా పట్టించుకోకపోవడం లెక్కలేనితనమే అని ప్యానెల్ పేర్కొంది. చేసిన వాఖ్యలకు తమకు వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ హెచ్చరించింది. వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. రెండోసారి పంపిన సమన్లను సల్మాన్ ఖాన్ తిరస్కరించాడు. 
 
ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పే ప్రశక్తే లేదని సల్మాన్‌ఖాన్ కమిషన్‌కే ప్రత్యుత్తరం పంపాడు. అయితే తుది సమన్లకు బదులు ఇవ్వకుంటే బెయిలబుల్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉందని ప్యానెల్ పెర్కొంది. ఇకపోతే సల్మాన్ ఖాన్ పంపిన లేఖ తమకు అందిందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహక్తర్ వెల్లడించారు. న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.