మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (13:16 IST)

డ్రగ్స్ దందా : బాలీవుడ్ నిర్మాత భార్య అరెస్టు.. హీరో ఇంట్లో సోదాలు

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఇప్ప‌టికే మాదకద్రవ్యాల కేసులో ప‌లువురిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తాజాగా ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నదియడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఆదివారం అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం సబర్బన్‌లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల గంజాయి లభ్యమైంది. 
 
దీన్ని ఓ వ్యక్తి ద్వారా ష‌బానా దాని నుంచి కొనుగోలు చేసినట్లు తేలడంతో ఎన్సీబీ అధికారులు ఆదివారం ఆమెను విచారణకు పిలిచారు. విచారణ అనంతరం షబానాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిరాజ్‌ భార్య షబానాను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద అరెస్టు చేసినట్లు జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖేడే తెలిపారు ఈ కేసులో ఫిరోజ్‌ని కూడా విచారించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.
 
ఇదిలావుంటే, సోమవారం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు. ముంబైలోని అత‌ని ఇంటిని పూర్తిగా త‌నిఖీ చేసిన‌ట్టు తెలుస్తుంది. సోదాల‌లో ఏమైన డ్ర‌గ్స్ బ‌య‌ట ప‌డితే అత‌నిని అరెస్టు చేసే అవ‌కాశం ఉంది.
 
కాగా, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ముందుగా  రియా చ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా దీపికా ప‌దుకొనె, సారా అలీఖాన్, శ్ర‌ద్ధా క‌పూర్, క‌రీష్మా ప్ర‌కాశ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని విచారించారు.