శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (11:33 IST)

బెల్లంకొండ, రకుల్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్: కేథరిన్ డ్యాన్స్.. ఆరుగురు హీరోలు-ఆరుగురు హీరోయిన్లు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా జయ జానకి నాయక. ఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం సోషల్ మీడియాలో రిలీజైంది. ఇటీవల టై

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా జయ జానకి నాయక. ఈ  సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం సోషల్ మీడియాలో రిలీజైంది. ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన సినిమా యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టరును విడుదల చేసింది. బెల్లంకొండ శ్రీను రోడ్డుపై కూర్చొని ఉండగా, రకుల్ బైక్ పై కూర్చొని ఫోటోలకి ఫోజులిచ్చింది.
 
జూలై ఏడో తేదీన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీనివాస్‌తో పాటు మొత్తం ఆరుగురు హీరోలు.. మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిపి ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఒకప్పటి హీరోలు జగపతిబాబు, శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. వారే కాక ‘సై’ ఫేమ్ శశాంక్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇక హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కాక మరొక హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ చేస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్ థ్రెసా కనిపించనుందని టాక్ వస్తోంది.