శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By

హాన్సిక చిత్రం ఫస్ట్ లుక్ అదుర్స్

ఒకపుడు జూనియర్ ఖుష్బూగా ప్రశంసలు అందుకున్న హీరోయిన్ హాన్సిక. ప్రస్తుతం అవకాశాలు లేక టాలీవుడ్ వెండితెరకు దూరమైంది. కానీ, కోలీవుడ్‌లో స్థిరపడిపోయింది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న 50వ చిత్రం పేరు "మ‌హా". యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 
 
హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. ఇందులో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ లుక్‌లో క‌నిపిస్తుంది. గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర‌ని హ‌న్సిక ఈ చిత్రంలో చేస్తుంద‌ని అంటున్నారు. 
 
ఇందులో విల‌క్ష‌ణ పాత్ర చేస్తున్న హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌నుంద‌ట‌. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హ‌న్సిక తెలుగులో సందీప్ కిష‌న్‌తో క‌లిసి జి.నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో 'తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్' అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.