శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 5 డిశెంబరు 2018 (22:11 IST)

సందీప్ కిష‌న్, హ‌న్సిక జంట‌గా తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.

కుర్ర హీరో సందీప్ కిష‌న్ తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. డిసెంబ‌ర్ 4న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ సినిమాను ప్ర‌క‌టించారు. హ‌న్సిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 
 
సందీప్ కిష‌న్‌తో ఈమె న‌టించబోయే తొలి సినిమా ఇదే. వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది.. అదే రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కానుంది. 
 
సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, పృథ్వీ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌ర‌రెడ్డి నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి, నిర్మాణ సంస్థ‌: ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్, కో-ప్రొడ్యూస‌ర్: జ‌గ‌దీష్, క‌థ‌: రాజ‌సింహ, సంగీతం: శేఖ‌ర్ చంద్ర, సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కే నాయుడు, మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.