శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (19:33 IST)

నడిగర్ సంఘంలో మేనేజర్.. హన్సికపై ఆ కేసు పెట్టాడట?

అందాల ముద్దుగుమ్మ దేశముదురుతో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల, అగ్ర హీరోయిన్ హన్సికపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు హన్సిక మేనేజర్ మునుస్వామి నడిగర్ సంఘంలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం విక్రమ్ ప్రభు '

అందాల ముద్దుగుమ్మ దేశముదురుతో అరంగేట్రం చేసిన తెల్లపిల్ల, అగ్ర హీరోయిన్ హన్సికపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు హన్సిక మేనేజర్ మునుస్వామి నడిగర్ సంఘంలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం విక్రమ్ ప్రభు ''తుపాకి మునై'', అధర్వ టైటిల్ ఖరారు కాని సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో చాలారోజుల పాటు హన్సిక వద్ద పనిచేసిన మునుస్వామి తనకు మ‌నీ సెటిల్‌మెంట్ చేయడం లేదంటూ న‌డిగ‌ర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. 
 
జ‌న‌ర‌ల్‌గా హ‌న్సిక డేట్స్‌తో పాటు రెమ్యున‌రేష‌న్ విష‌యాల‌ని ఆమె త‌ల్లే చూసుకుంటారు. కాని మునుస్వామి అనే వ్య‌క్తి చెబుతున్న మాట‌లు అభిమానుల‌కు షాక్‌నిచ్చాయి. తాను ఆధారాలతోనే మాట్లాడుతున్నానని మునుస్వామి చెప్పాడు. కానీ హన్సిక మాత్రం ఈ వివాదంపై నోరు విప్పలేదు. తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి జంప్ అయిన హన్సిక.. కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్ (వేలాయుధం, పులి), సూర్యతో (సింగం-2), ధనుష్‌తో (మాప్పిళ్లై), సింబుతో (వాలు), శివకార్తీకేయన్‌తో (మాన్ కరాటే) వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.