మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (17:00 IST)

నిత్యం యవ్వనంగా ఉండాలంటే...

చాలామంది వయసుపైబడే కొద్దీ నిత్యంయవ్వనంగా ఉండాలని పరితపిస్తుంటారు. ఇందుకోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, తరాలు మారుతున్నా.. మనసులో ఉరిమే ఉత్సాహం ఉంటే నిత్యం యవ్వనంగా ఉండటం పెద్ద సులభమేమీ కాదని నిపుణులు అంటున్నారు. అయితే, ఇందుకోసం చిన్నపాటి సూచనలు, సలహాలు పాటించాల్సి ఉంటుంది. 
 
* వయసు మీదపడినంత మాత్రాన రొటీన్ లైఫ్‌ గడపకూడదనే నిబంధన ఏమీలేదు. ప్రేమ, రొమాన్స్ ఈ రెండూ యవ్వనానికి హాల్‌మార్క్ సింబల్స్‌గా భావించాలి. 
 
* జీవిత భాగస్వామిలో మీకు నచ్చిన గుణాలను మరింత ఇష్టపడండి. ఈ విషయం వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి. వారితో కలిసి సాయంసధ్యవేళల్లో వాటిని ఓసారి నెమరువేసుకోండి. 
 
* ఇలా చేయడం వల్ల పైబడే వయసును ఆపలేకపోవచ్చు కానీ, యవ్వనంగా తీర్చిదిద్దుకోవడం మాత్రం సాధ్యమేనని గుర్తించండి. 
 
* అన్నిటికంటే ముఖ్యంగా, వయసు మీదపడుతున్నా జడత్వాన్ని మాత్రం దరిచేరనీయొద్దు. వీలైనంత ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. వయసు అయిపోయింది కదా అని ఒకే గదికి పరిమితం కావొద్దు. 
 
* ఛాన్స్ లభించినపుడల్లా వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ప్రయత్నించండి. ఇలాంటి చిట్కాలు పాటించినట్టయితే నిత్యం యవ్వనంగా ఉండటం ఖాయం.