శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (11:23 IST)

తేనె - చక్కెర - బాదంనూనె మిశ్రమాన్ని పెదవులకు రాస్తే...

శీతాకాలంరాగానే పెదవులపై తడి అరిపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. అలాకాకుండా ఉండాలంటే చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. సాధారణంగా ఇలా పెదాలకు పగుళ్లు ఏర్పడితే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు పెదాలకు వ్యాసిలిన్ లేదా లిప్‌కేర్ పెడితే సరిపోతుందని భావిస్తుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతులు. 
 
సహజంగా పెదవులు ఎల్లవేళలా తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా రాయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎల్లపుడూ తాజాగా కనిపిస్తుంటాయి.