శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (14:50 IST)

చైనా పిల్లల నెత్తిమీద మొక్కలు మొలుస్తున్నాయ్...

ఈమధ్య కాలంలో చైనా మహిళలు, పిల్లల నెత్తిమీద మొక్కలు మొలుస్తున్నాయి. పిల్లా పెద్దా అనే తేడా లేకుండా అందరి తలల మీదా చిన్న చిన్న మొక్కలు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. 
 
జుట్టులో నుంచి వచ్చిన కొన్ని మొక్కలైతే పువ్వులు కూడా పూస్తున్నాయట. చిన్న పిల్లలైతే 'వాళ్లు పండు తినేటపుడు గింజల్ని మింగేశారా అమ్మా, తల్లోనుంచి మొక్కలు మొలిచాయి' అని ఆశ్చర్యపోతున్నారు. 
 
అసలు విషయం ఏంటంటే... ఇదంతా కొత్తగా పుట్టుకొచ్చిన ఓ క్రేజీ ఫ్యాషన్‌. చిన్న చిన్న ప్లాస్టిక్‌ మొక్కల్ని అంటించిన తల క్లిప్పులు ఇప్పుడక్కడో ట్రెండ్‌. వాటిని పెట్టుకోవడం వల్ల అలా తల్లో మొక్కలు మొలిచినట్లు కనిపిస్తున్నాయి. 
 
పిల్లలూ అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా వీటిని పెట్టుకోవడం మరో విచిత్రం. అన్ని చైనా ఉత్పత్తులూ వచ్చినట్లే త్వరలో ఇవి కూడా మన వీధుల్లోకి త్వరలోనే వచ్చేస్తాయి లెండి.