సోమవారం, 31 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2025 (11:13 IST)

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

Game changer pairacy
Game changer pairacy
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాను జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే పైర‌సీ చేసి ఆ సినిమాను ఏపీ లోక‌ల్ టీవీలో ప్ర‌సారం చేశారు. దీనిపై చిత్ర నిర్మాత‌లు, టీమ్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసి విశాఖ‌ప‌ట్ట‌ణం క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
Game changer pairacy
Game changer pairacy
ఈ కేసు విష‌యంలో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతిరాజు అండ్ టీంతో పాటు గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్‌.. అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై ఏపీ దాడులు నిర్వహించింది. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేసి అరెస్టు చేశారు.