శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (08:06 IST)

హైదరాబాద్‌లో గేమ్‌ఛేంజర్ ఎమోషనల్‌ సీన్‌ షూట్‌ జరుగుతోంది

charan-shankar
charan-shankar
దర్శకుడు శంకర్,  గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి గేమ్‌ఛేంజర్ మరొక షెడ్యూల్‌ను నిన్నటి నుంచి ప్రారంభించాడు. హైదరాబాద్‌లో గేమ్‌ఛేంజర్ ఎమోషనల్‌ సీన్‌ షూట్‌ జరుగుతోంది. దీనిని సంభందించి శంకర్, చరణ్ కు సీన్ వివరిస్తున్న ఫోటో షేర్ చేసారు. ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొననున్నారు. చరణ్ ఇందులో డ్యూయెల్ రోల్ చేసున్నారు. పొలిటికల్ క్యారెక్టర్ కు సంబంధించి ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది. 
 
ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు