శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (12:32 IST)

బాలకృష్ణ‌లో రాజసం ఉట్టిపడింది.. సింహం మీ మ‌ధ్య‌లో కూర్చుంది.. 'గౌతమిపుత్రశాతకర్ణి' ట్రైలర్ అదుర్స్

ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన నూరో చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా ట్రైల‌ర్‌ శుక్రవారం విడుదలైంది. జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రై

ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన నూరో చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమా ట్రైల‌ర్‌ శుక్రవారం విడుదలైంది. జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ట్రైల‌ర్ విడుద‌లైంది. గుర్రంపై స్వారీ చేస్తూ యుద్ధంలో శ‌త్రు సైన్యంతో త‌ల‌ప‌డుతూ బాల‌కృష్ణ సినిమాలో క‌న‌ప‌డిన తీరు ప్రేక్ష‌కులతో విజిల్స్ వేయించింది. సినిమా ట్రైలర్ ను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ అభిమాన నటుడిని గౌతమీపుత్ర శాతకర్ణిగా అభిమానులు చూసుకున్నారు. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా బాలకృష్ణ‌లో రాజసం ఉట్టిపడింది.
 
ఇకపోతే... ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ... సింహం మీ మ‌ధ్య‌లో కూర్చుందని బాల‌కృష్ణ‌ను  ఉద్దేశించి అన్నారు. బాల‌య్య ఈ సినిమాను ఎందుకు త‌మ‌ చేతిలో పెట్టారో ప్రేక్ష‌కుల‌కి ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. కోటిర‌త‌నాల వీణ తెలంగాణ‌లో కోటిలింగాల సాక్షిగా నూరో చిత్రం ట్రైల‌ర్‌ రిలీజ్ చేయ‌డానికి వ‌చ్చామ‌ని అన్నారు. 
 
30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’  చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ పాట కోసం ఒక సాంగ్‌ను ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారని దర్శకుడు క్రిష్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ పవర్ ఫుల్ సాంగ్‌ను ఆయన రాశారని అన్నారు. ‘గ్రేట్ సాల్యూట్స్ టు గురువుగారు...’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్న క్రిష్, విమానంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.