సంబంధిత వార్తలు
- పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం నావల్ల కాదుబాబోయ్ అంటున్న హీరో
- గీత గోవిందం దర్శకుడి తదుపరి చిత్రానికి షాకింగ్ స్టోరీ
- విజయ్ దేవరకొండ, పూరి కాంబో మూవీ వార్తల్లో నిజమెంత..?
- అగ్ర హీరోగా ఎదిగిన అర్జున్ రెడ్డి.. అంతా గీత గోవిందం ఎఫెక్టే?
- నువ్వు హీరో ఏంట్రా... ఆ క్యారెక్టర్‌కు కూడా సరిపోవన్నారు : విజయ్ దేవరకొండ
సినీ ఇండస్ట్రీకి కొత్త పాఠం నేర్పిన 'గీత గోవిందం' సక్సెక్
తెలుగు చిత్ర పరిశ్రమల పెద్దలకు 'గీత గోవిందం' చిత్రం సరికొత్త గుణపాఠం నేర్పింది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్
తెలుగు చిత్ర పరిశ్రమల పెద్దలకు 'గీత గోవిందం' చిత్రం సరికొత్త గుణపాఠం నేర్పింది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు నిర్మించాడు.
ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ సాధించింది. పైగా, ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు ఓవర్సీస్, మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో ఈ చిత్రం సాధించిన వసూళ్ల గురించి ట్రేడ్ గొప్పగా చెబుతోంది. ఇదో రియల్ జెన్యూన్ విజయమంటూ కితాబిస్తోంది.
పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కి రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంచలన చిత్రంగా 'గీత గోవిందం' గురించి మార్కెట్ విశ్లేషకులు గొప్పగా చెబుతున్నారు. ఇది మరో సైరాఠ్ తరహా విజయం అనడంలో సందేహమే లేదని వారంటున్నారు. చెన్నైలో అయితే ఈ చిత్రం ఏకంగా రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదీ కూడా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే.
కనీసం డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేయలేదు. అయినా ఇంత పెద్ద హిట్టయ్యిందంటే మంచి సినిమాని ఆదరించేందుకు ప్రేక్షక జనం ఎప్పుడూ ముందుంటారని మరోమారు రుజువు చేశారు ప్రేక్షకులు. చిత్రం బాగుంటే నటీనటులతో సంబంధం లేకుండా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని తేలింది.
తర్వాతి కథనం
