గీత గోవిందం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రానికి షాకింగ్ స్టోరీ

గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్ట‌ర్స్‌లో లిస్టులో చేరిపోయాడు ప‌ర‌శురామ్. గీత గోవిందం చిత్రాన్ని 14 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తే.. 100 కోట్ల గ్రాస్ 60 కోట్ల షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ప‌ర‌శురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. అగ్ర

srinivas| Last Modified శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:11 IST)
గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్ట‌ర్స్‌లో లిస్టులో చేరిపోయాడు ప‌ర‌శురామ్. గీత గోవిందం చిత్రాన్ని 14 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తే.. 100 కోట్ల గ్రాస్ 60 కోట్ల షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. దీంతో ప‌ర‌శురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. అగ్ర హీరోల నుంచి యువ‌హీరోల వ‌ర‌కు ప‌ర‌శురామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అంటున్నారు. కానీ.. ప‌ర‌శురామ్ నెక్ట్స్ మూవీని కూడా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లోనే చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసాడు. అయితే.. నెక్ట్స్ ఎలాంటి మూవీ చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఇప్పటికే నిర్మాత బన్నీవాసుకు ప‌ర‌శురామ్ నాలుగైదు లైన్‌లు వినిపించాడ‌ట‌. అందులో దేవుడికి మనిషి మధ్య జరిగే ఓ కథను బన్నీవాసు ఫైనల్ చేసినట్టుగా తెలిపారు. పూర్తి స్క్రిప్ట్‌ రెడీ అయిన తరువాత అల్లు అరవింద్‌కు వినిపిస్తానని చెప్పాడు. దేవుడు - మ‌నిషి అంటున్నాడు. ఇదేదో సోషియో ఫాంట‌సీ మూవీనా అంటే కాదంటున్నాడు. చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నాడు. మ‌రి.. ఈ మూవీతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.దీనిపై మరింత చదవండి :