శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (16:05 IST)

5 రోజుల్లో గీత గోవిందం ఎంత క‌లెక్ట్ చేసిందో తెలుసా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గీత గోవిందం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ...సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో

విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గీత గోవిందం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ...సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీ వాస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం గీత గోవిందం సినిమా పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 
 
ఇక 5 రోజుల క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... నైజాం - రూ.8.65 కోట్లు, సీడెడ్ - 3.35 కోట్లు, వైజాగ్ - 2.20 కోట్లు, ఈస్ట్ - 1.86కోట్లు, వెస్ట్ - 1.50కోట్లు, కృష్ణ - 1.72 కోట్లు, గుంటూరు - 1.80 కోట్లు, నెల్లూరు - 0.68 కోట్లు, కర్ణాటక - 2.30 కోట్లు, తమిళనాడు - 0.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియా - 0.50 కోట్లు, యుఎస్ఎ - 5.95 కోట్లు, ఆస్ట్రేలియా - 0.50 కోట్లు, రెస్టాఫ్ ది వరల్డ్ - 0.50 కోట్లు, టోటల్ షేర్ - 31.21 కోట్లు షేర్ సాధించ‌డం విశేషం.