శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:37 IST)

గీత గోవిందం ముందుగా ఏ హీరోతో చేయాల‌నుకున్నారో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల

విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌రశురామ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఈ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. 100 కోట్ల గ్రాస్... 50 కోట్ల పైగా షేర్ సాధించి తెలుగు సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. 14 కోట్ల పెట్టుబ‌డితో 60 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.
 
భారీ బ‌డ్జెట్ మూవీ తీసినా ఇంత లాభం రాదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాను ముందుగా అల్లు శిరీష్‌తో చేయాల‌నుకున్నార‌ట‌. ప‌ర‌శురామ్ మాత్రం విజ‌య్‌తోనే చేయాల‌న్నాడ‌ట‌. అదే క‌లిసొచ్చింది. ఒక‌వేళ అల్లు శిరీష్‌తో చేస్తే ఈ రేంజ్ స‌క్స‌స్ వ‌చ్చేది కాదు. ఈ సినిమాతో ప‌ర‌శురామ్‌కి బాగా డిమాండ్ పెరిగింది. త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే అని ఎనౌన్స్ చేసారు. మ‌రి.. ఏ హీరోతో చేస్తారో చూడాలి.