మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 20 జులై 2018 (22:03 IST)

సూర్య నుంచి శిరీష్ అవుట్..! ఎందుకో తెలుసా?

తమిళ హీరో సూర్య 37వ సినిమాలో అల్లు శిరీష్ న‌టించ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కేవీ ఆనంద్‌ దర్శకుడు. మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్‌లాల్, సాయేషా సైగల్‌, సముద్రఖని నటిస్త

తమిళ హీరో సూర్య 37వ సినిమాలో అల్లు శిరీష్ న‌టించ‌నున్నాడ‌ని గ‌త కొన్ని రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కేవీ ఆనంద్‌ దర్శకుడు. మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్‌లాల్, సాయేషా సైగల్‌, సముద్రఖని నటిస్తున్నారు. అయితే...ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు అల్లు శిరీష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. దీనికి కార‌ణం డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం అని తెలియ‌చేసాడు.
 
త‌ను న‌టిస్తోన్న‌ ‘ఏబీసీడీ’కు డేట్స్‌ అవసరమైనప్పుడే సూర్య చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌స్తోంది. అందుచేత స్వచ్ఛందంగా సూర్య సినిమా నుంచి తప్పుకుంటున్నా. దర్శకుడు కేవీ ఆనంద్‌ గారు నా సమస్య తెలుసుకుని.. నా నిర్ణయానికి ఓకే చెప్పారు. నాకు ఈ సినిమాలో నటించాలని ఉంది. కానీ కుదరలేదు. కేవీ, సూర్య, లైకా ప్రొడక్షన్స్‌కు ధన్యవాదాలు అని తెలియ‌చేసాడు. ఇదిలా ఉంటే... శిరీష్ పోషించాల్సిన పాత్ర‌ను ఆర్య చేస్తున్నాడు.