గురువారం, 21 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (16:27 IST)

19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కథతో ఘటికాచలం

Ghatikachalam team
Ghatikachalam team
నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కథతో చిత్రం రూపొందుతోంది. ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఎం.సి.రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. త్వరలోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి. ఈరోజు "ఘటికాచలం" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
 
రైటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మామూవీని మీరంతా సపోర్ట్  చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
డైరెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ - ఘటికాచలం కంటెంట్ బేస్డ్ మూవీ. అమర్ నా ఫ్రెండ్. ఈ కథ నాకు చెప్పినప్పుడు చాలా బాగుంది అనిపించింది. కథను చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్టర్ అమర్ అనుకున్నది రూపొందించాడు. రిలీజ్ ఎలా చేస్తారని అనుకున్నప్పుడు మారుతి గారు ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారని అమర్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అన్నారు.
 
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ - ఘటికాచలం సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. నేను ఎదురుచూస్తున్న ఒక మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో దొరికింది. ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఇది జరిగిన సంఘటనల నేపథ్యంతో తెరకెక్కించారు. ఫుల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఎస్కేఎన్, మారుతి గారు మూవీ తీసుకున్నారంటేనే ఈ మూవీలో ఎంతమంచి కంటెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ ఈ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్తారు. అన్నారు.
 
డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ - ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.  19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. నా ఫ్రెండ్ రాజుకు థ్యాంక్స్ చెబుతున్నా. మంచి టెక్నీషియన్స్ మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎవరు దొరుకుతారని చూశాను. మంచి టీమ్ దొరికారు. ఇలాంటి సినిమా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు. మారుతి గారికి ట్రైలర్ చూపించాను. ఆయనకు నచ్చి మూవీ చూపించు అన్నారు. చూపించాను. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి. అన్నారు.
 
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ, ఘటికాచలం సినిమా ఒక టీనేజ్ అబ్బాయి, వాళ్ల అబ్బాయి మధ్య జరుగుతుంది. కథలో ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే పెద్ద పని అయ్యింది. నేను 15 ఏళ్లుగా నటిస్తున్నాను. 60 నుంచి 70 మూవీస్ చేశాను. ఘటికాచలం సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ  - ఘటికాచలం సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయలేరు. మీ ఊహకతీతంగా సినిమా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు ఘటికాచలం సినిమా సీన్స్ గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి మూవీని మా మారుతి గారు, ఎస్కేఎన్ గారు రిలీజ్  చేస్తుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.
 
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, సినిమా చూస్తున్నంతసేపూ ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అనేదాని కంటే టెక్నికల్ గా ఉన్న క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ అమర్ ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న డైరెక్టర్ లా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్ గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది.  నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. ఘటికాచలం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మా బేబీ సినిమా హందీ వెర్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. అన్నారు.