బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (15:30 IST)

మట్కాలో లేలేలే రాజా అంటూ యూత్ హృదయాలను దోచుకోనున్న నోరాఫతేహి

Matka- Nora fatehi
Matka- Nora fatehi
వరుణ్ తేజ్ నటించిన తొలి పాన్-ఇండియన్ సినిమా మట్కా. తన రక్తాన్ని, చెమటను ఈ సినిమాకి ధారపోశాడు, ఇటీవల విడుదలైన టీజర్‌ విజయం సాధించడం ఆయన అంకితభావానికి నిదర్శనం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. 

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, సినిమా  OTT ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులను గణనీయమైన మొత్తానికి సొంతం చేసుకుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
 
మరో తాజా అప్ డేట్ ఏమంటే, నోరాఫతేహి డాన్స్ చేసిన లేలేరాజా.. అనే ఐటెంసాగ్ ను ఈరోజు విడుదల చేస్తున్నారు మేకర్. అందుకు సంబంధించిన సాంగ్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. భాస్కరభట్ట రవికుమార్ రాసిన ఈ గీతాన్ని నీతి మోహన్ ఆలపించారు.  జివి ప్రకాష్ కుమార్  సౌండ్‌ట్రాక్  సరికొత్తగా వుండేట్లు చర్యలు తీసుకున్నారు.
 
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు SRT ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన మట్కా నవంబర్ 14, 2024న సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.