శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:30 IST)

గీతా.. ఐ లవ్ యూ: కౌషల్, సామ్రాట్‌... ఐ హేట్ యు: గీత

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ ఇంటి సభ్యులందరికీ లవ్ హేట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా సభ్యులు ఒక్కొక్కరూ ఒకరికి ఐ లవ్యూ మరియు మరొకరికి ఐ హేట్ యూ చెప్పి అందుకు తగిన కారణాలను ఇవ్వాల్సి ఉంటుంది. మీమీ అభ

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ ఇంటి సభ్యులందరికీ లవ్ హేట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా సభ్యులు ఒక్కొక్కరూ ఒకరికి ఐ లవ్యూ మరియు మరొకరికి ఐ హేట్ యూ చెప్పి అందుకు తగిన కారణాలను ఇవ్వాల్సి ఉంటుంది. మీమీ అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా అందరి ముందే చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. ముందుగా గీతతో మొదలైన ఈ టాస్క్ ఎంతో సరదాగా, ఎమోషనల్‌గా సాగింది. గీతా మాధురి దీప్తికి ఐ లవ్యూ చెప్పి, అందుకు కారణాలను చెప్పుకొచ్చింది.
 
ఇక వెంటనే సామ్రాట్‌కు ఐ హేట్ యు చెప్పి, అందుకు కారణం హౌస్‌కి వచ్చిన 60 రోజుల తరువాతే మీలో ఉన్న కిడ్ నాకు కనిపించారు. ఒకవేళ ఆలోపు మీరో నేనో ఎలిమినేట్ అయ్యి ఉంటే ఈ విషయం తెలిసేది కాదు. 60 డేస్ వేస్ట్ చేశాము.. అందుకే ఈ ఐ హేట్ యు అని ముద్దుగా చెప్పింది గీత.
 
కౌశల్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తాను ప్రేమించే వ్యక్తి గీతా మాధురి అని చెప్పారు. అందుకు కారణం.. నాకు మీరు 15 ఏళ్లుగా తెలుసు.. మీ కంటే నాకు హౌస్‌లో తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. మీ ప్రవర్తన, మీ అమాయకత్వం, మీ తింగరితనం నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే తాను ద్వేషించే వ్యక్తిగా కూడా గీతా మాధురినే ఎంచుకున్నారు. అందుకు కారణంగా "నేను చేయని వాటిని చేశానని, అనని వాటిని అన్నట్టుగా ఊహించుకుని ప్రతి దానికి గొడవ పడటం నాకు నచ్చలేదు" అని చెప్పేసారు.
 
అమిత్.. ప్రేమించే వ్యక్తి రోల్ రైడా, ద్వేషించే వ్యక్తి కౌశల్.
తనీష్.. ప్రేమించే వ్యక్తి సామ్రాట్, ద్వేషించే వ్యక్తి కౌశల్.
శ్యామల.. ప్రేమించే వ్యక్తి గీతా మాధురి, ద్వేషించే వ్యక్తి తనీష్.
దీప్తి నల్లమోతు.. ప్రేమించే వ్యక్తి గీతా మాధురి, ద్వేషించే వ్యక్తి సామ్రాట్.
సామ్రాట్.. ప్రేమించే వ్యక్తి తనీష్, ద్వేషించే వ్యక్తి గీతా మాధురి.
రోల్ రైడా.. ప్రేమించే వ్యక్తి అమిత్, ద్వేషించే వ్యక్తి తనీష్. ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించారు.