బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (14:01 IST)

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో చిత్రం పూజతో ప్రారంభం

K Raghavendra Rao is providing the script
K Raghavendra Rao is providing the script
గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వ వెంచర్‌ను ఈరోజు రామానాయుడు స్టూడియో లో పూజతో ప్రారంభించారు. చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం. 1లో వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. మాస్, కుటుంబాలను సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల గోపీచంద్‌తో ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు.
 
వేణు దోనేపూడి ప్రముఖ తారలతో భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించేందుకు సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్‌ను ప్రారంభించారు. #గోపీచంద్ 32 ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన మొదటి సినిమా. సినిమాలోని చాలా భాగాలను విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.
 
భారీ బడ్జెట్‌తో అత్యంత విపరీతంగా తెరకెక్కుతున్న చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.
 
శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరా చేయనుండగా, చైతన్ భరద్వాజ్ సంగీత విభాగానికి హెల్మ్ చేయనున్నారు. ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలో వెల్లడించనున్నారు.