1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (16:04 IST)

ఇర‌వై ఏళ్ళుగా సంతోషం అవార్డులు ఇవ్వ‌డం గ్రేట్ - అలీ

Santosham awards logo
గ‌త ఇర‌వై ఏళ్ళుగా సంతోషం సినీ అవార్డుల‌ను గేప్ లేకుండా ఇవ్వ‌డం మామూలు విష‌యం కాద‌ని- న‌టుడు అలీ పేర్కొన్నారు. హీరోయిన్లు మన్నారా చోప్రా, హెబ్బా పటేల్, ఇంద్రజ, బిగ్‌బాస్ ఫేమ్ బ్యూటీలు దివి, హమీదతో పాటు  అక్సఖాన్ తో పాటు ప‌లువురు ద‌క్షిణాదిలో ఇలా చేయ‌డం గొప్ప‌గా వుంద‌ని పేర్కొన్నారు. 
 
ఈ అవార్డుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. న‌వంబ‌ర్ 14న హెచ్ఐసీసీలోని (హైద‌రాబాద్‌) నోవాటెల్‌లో మధ్యాహ్నం ౩ గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో డ్యాన్స్ చేసే అందగత్తెలు రిహారల్స్ మొదలు పెట్టారు. ఆట సందీప్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. హీరోయిన్లు మన్నారా చోప్రా, హెబ్బా పటేల్, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, బిగ్‌బాస్ ఫేమ్ బ్యూటీలు దివి, హమీదతో పాటు  అక్సఖాన్ తో పాటు మరికొందరు ఈ  తమ డ్యాన్స్‌తో ఆకట్టుకోనున్నారు.  
 
సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి సంకల్పంతో ఏర్పాటైన సంతోషం సౌతిండియా సినిమా అవార్డ్స్ కార్యక్రమం ఈ సారి ఎన్ స్క్వేర్  సమర్పణలో సుమన్ టీవీ భాగస్వామంతో జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాల‌ను శుక్రవారం రాత్రి హ‌:ద‌రాబాద్‌లో కర్టైన్ రైజర్ వేడుక లో వివ‌రించారు. ఈ వేడుకకు ముఖ్య అథితులుగా ప్రముఖ నటుడు ఆలీ, ఇంద్రజ, సుశాంత్, పూరి ఆకాష్, దివి, హమీద, అక్సఖాన్ , హెబ్బా పటేల్, ఎన్ స్కోయర్ ఎండి నవీన్ రెడ్డి, సుమన్ టివి సి ఈ ఓ పద్మజ, జర్నలిస్ట్ ప్రభు లతో పాటు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నటుడు ఆలీ చేతుల మీదుగా సంతోషం - సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక బ్రోచర్ లాంచ్ చేసారు.
 
అనంతరం నటుడు ఆలీ మాట్లాడుతూ, అవార్డుల విషయంలో 20 సంవత్సరాలు పూర్తీ చేయడం అన్నది మాములు విషయం కాదు. సినిమా రంగంలో ఉన్న పెద్ద వారిని ఈ వేడుకలలో హాజరవ్వడం మాములు విషయం కాదు. ఈ అవార్డు వేడుకలను నిర్విరామంగా నిర్వహిస్తున్న సురేష్ కొండేటి కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. సంతోషం అవార్డు వేడుకలకు సుమన్ టివి తోడైంది. సురేష్ ఈ అవార్డు వేడుకలు 20 ఏళ్ళు కాదు మరో ఇరవై ఏళ్ళు ఇలాగె కొనసాగాలని, నీ తరువాత నీ పిల్లలు కూడా కంటిన్యూ చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో సుశాంత్ మాట్లాడుతూ,  సంతోషం చాలా పాజిటివ్  వైబ్స్ ఉన్నాయి. నేను కెరీర్ ప్రారంభించినప్పటినుండి నాకు బాగా తెలుసు. నా మొదటి ఇంటర్వ్యూ ని సురేష్ గారికే ఇచ్చాను. నాకు బాగా గుర్తుంది. ఈ అవార్డు వేడుకలు చేయడం అన్నది మాములు విషయం కాదు, కానీ ఈ వేడుకలను గత ఇరవై ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న సురేష్ గారి సంకల్పం ఏమిటో అర్థం అవుతుంది. సో ఈ నెల 14న జరిగే అవార్డుల వేడుకకు నేను వస్తున్నాను, తప్పకుండా అందరు రావాలి అన్నారు.
 
పూరి ఆకాష్ మాట్లాడుతూ,  20 ఏళ్ళు ఇలా అవార్డు వేడుకలు చేయడం మాములు విషయం కాదు. ఈ అవార్డు వేడుకలు మరో ఇరవై ఏళ్ళు ఇలాగె గ్రాండ్ గా జరగాలి. సురేష్ గారు ఎంత డెడికేషన్ తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఈ అవార్డు వేడుకల ప్రోమో చూస్తుంటే నాకు రావాలని ఎగ్జైట్ గా ఉంది .. ఆల్ ది బెస్ట్ సురేష్ గారు అన్నారు.
 
Suresh kondeti -Hebba
హీరోయిన్ మన్నారా చోప్రా మాట్లాడుతూ .. సంతోషం అవార్డ్స్ వేడుకల్లో పాల్గొనడం నాకు ఇది నాలుగో సారి. నాకు చాలా ఇష్టమైన అవార్డుల వేడుక ఇది. సురేష్ గారు నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
 
హీరోయిన్ ఇంద్రజ మాట్లాడుతూ .. అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ గారు నాకు హీరోయిన్ అయినప్పటినుండి తెలుసు. అప్పట్లో బాగా కలిసేవాళ్ళం. సురేష్ గారు 20 వ అవార్డు వేడుకలు జరుపుతున్నందుకు కంగ్రాట్స్. సంతోషం, సుమన్ టివి ఇద్దరు కలిసి ఈ అవార్డు వేడుకలు నిర్వహించడం నిజంగా మంచి విషయం. సంతోషం అవార్డు వేడుకలు 20 ఏళ్లుగా జరుగుతుంటే నన్ను ఎప్పుడు పిలవలేదు.. కానీ ఈ అవార్డు వేడుకల్లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకల్లో చిరంజీవి గారి సాంగ్ కి డాన్స్ చేస్తున్నాను. ఈ సందర్బంగా అందరియాకి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.
 
సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ఈ అవార్డు వేడుకలు జరపడానికి కారణం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరు. నేను కృష్ణగారి అభిమానిని, ఆ తరువాత చిరంజీవి గారి ప్రోత్సహంతో నేను ఈ రంగంలో ఎదిగాను. ఈ సందర్బంగా తెలుగు రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను. అలాగే ప్రతి ఏడాది ఈ అవార్డు వేడుకలు జరుపుతున్నాం. కానీ ఇటీవలే కరోనా ఎఫెక్ట్ తో గత రెండు సంవత్సరాలు ఈ వేడుకలు జరపలేదు. కరోనా వల్ల అందరు చాలా కష్టపడ్డారు. ఈ సారి గ్రాండ్ గా ఈ అవార్డు వేడుకలను మరో ఇరవై ఏళ్ళు గుర్తుండిపోయేలా నిర్వహిస్తున్నాం. ఇలాంటి అవార్డు వేడుకలు నిర్వహించడం మాములు విషయం కాదు. ఈ విషయంలో సురేష్ నీకు నేనున్నాను అంటూ ఎన్ స్క్వేర్  ఎండి నవీన్ రెడ్డి కి థాంక్స్ చెబుతున్నాను. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మా టీం కు కూడా సపోర్ట్ చేస్తున్నారు వారికి స్పెషల్ థాంక్స్. ఎస్పీ బాలు గారి మరణం తీరని లోటు.. అయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు గుర్తుగా వందమంది సింగర్స్, వంద పాటలతో గ్రాండ్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ రంగాలకు సంబందించిన స్టార్స్ కూడా వస్తున్నారు. చాలా గ్రాండ్ గా జరగబోయే ఈ వేడుక అందరి ఆశీస్సులలతో గ్రాండ్ గా జరగుతుందని, ఈ వేడుకల్లో అందరు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేస్తారని  కోరుకుంటున్నాను అన్నారు.