ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (16:29 IST)

వేయి శుభములు కలుగు నీకు అంటూ ఆశీర్వ‌దిస్తున్న వ‌క్త‌లు

Veyi Subhamulu Kalugu Neeku pre release
న‌టుడు  శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా క‌థానాయ‌కుడిగా తమన్నా వ్యాస్ హీరోయిన్ గా న‌టించిన సినిమా `వేయి శుభములు కలుగు నీకు`. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన వ‌క్త‌లంతా టైటిల్‌కు త‌గిన‌ట్లే చిత్ర యూనిట్‌కు వేయి శుభములు కలుగు మీకు అంటూ ఆశీర్వ‌దించారు.
 
జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాస రావులు నిర్మించారు. ఈనెల 7వ తేదీ విడుద‌ల‌కాబోతోంది. 
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ దర్శకుడు వీర భద్రం చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఫాదర్ & సన్  ల సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబం లో ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ కి కనెక్ట్ అవుతుంది. మంచి కథతో RRR తేదీ రోజున  ప్రేక్షకుల ముందుకు  వస్తుంది. దర్శకుడు రామ్స్ రాథోడ్ తో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మిస్తున్న నిర్మాత‌ల‌కు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన‌న్నారు.
 
ఇంకా హీరో ఆకాష్ పూరి, బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ, బిగ్ బాస్ విశ్వ, మేఘామ్స్ శ్రీహరి మాట్లాడుతూ.. విజయ్ రాజా డ్యాన్స్ చేస్తున్నపుడు సైడ్ నుండి చూస్తుంటే అఖిల్ లా అనిపిస్తున్నావు.తను చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం  సాధించాలని ఆకాంక్షించారు.
 
చిత్ర దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ, తండ్రి కొడుకు ల మధ్య ఇంత రిలేషన్ ఉంటుందా అనేలా అద్భుతంగా మా సినిమా ఉంటుంది.ఈ సాంగ్ ను చూసిన వారంతా ఆ సాంగ్ కు కనెక్ట్ అవుతారు.మ్యూజిక్ డైరెక్టర్ చ‌క్క‌టి సంగీతాన్ని అందించారు ఇందులోని పాటలన్నీటికీ మంచి వ్యూస్ వచ్చాయి. మంచి కంటెంట్ తో ఈ పండుగ వాతావరణంలో ఈ నెల 7 న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
.
చిత్ర నిర్మాతలు తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు మాట్లాడుతూ,  సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి  బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీశాం. ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ గా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.  కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఒక్క సెన్సార్ కట్ లేకుండా మాకు సెన్సార్ ఇచ్చారని తెలిపారు.
 
చిత్ర హీరో విజయ్ రాజా మాట్లాడుతూ,  షూటింగ్ టైం లో కోవిడ్ సమస్య వున్నా కూడా నాలాంటి చిన్న హీరోకు ఇంత బడ్జెట్ అవసరమా అని చూడకుండా చిత్ర నిర్మాతలు అనుకున్న దానికంటే ఎక్కువ ఖ‌ర్చుపెట్టారు. అందరూ ఆధరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.