ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (11:33 IST)

పెళ్లికి - సినిమాలకు లింకు పెట్టొద్దు : హన్సిక

hansika
టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మొత్వానీ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. ఆమెకు వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి జరుగనుంది. తన బాల్య స్నేహితుడిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. వీరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఉన్న 450 యేళ్లనాటి పురాతన ప్యాలెస్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి వివాహ ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరుగనుంది.
 
తన వివాహం గురించి హన్సిక స్పందిస్తూ, తాను పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలకు స్వస్తి చెప్పే ఉద్దేశ్యం లేదని చెప్పారు. "పెళ్లయ్యాక పని ఎందుకు మానెయ్యాలి" అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తన భర్త పని చేస్తున్నట్టుగానే తాను తన పని చేస్తానని తెలిపారు.