ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (17:04 IST)

సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుకునే మైండ్ సెట్ రావాలి : హ్యాపీ ఎండింగ్ ప్రొడ్యూసర్ అనిల్ పల్లాల

Happy Ending  team
Happy Ending team
యష్ పూరి హీరోగా అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించిన సినిమా "హ్యాపీ ఎండింగ్".  హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తోంది. క్లాసిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా పర్ ఫార్మ్ చేశారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్ కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం. నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో వికీ డోనర్ లా తెలుగులో "హ్యాపీ ఎండింగ్" మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" సినిమాలో పాటలు బాగున్నాయి అంటే ఆ క్రెడిట్ డైరెక్టర్ కౌశిక్ కు ఇవ్వాలి. ఆయన ఈ సినిమాకు పాటలు ఎలా ఉంటే బాగుంటుందో అలా డిజైన్ చేయించారు. ఈ సినిమాకు టెర్రఫిక్, టాలెంటెడ్ కాస్టింగ్ కుదిరారు. కౌశిక్, అపూర్వ క్యారెక్టర్స్ సినిమా పూర్తయ్యాక కూడా గుర్తొస్తాయి. బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు. నాలాంటి ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
ప్రొడ్యూసర్ అనిల్ పల్లాల మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" కమింగ్ ఏజ్ మూవీ. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ పనిచేశారు. ఈ వేదిక మీద మీకు ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. సౌండ్, విజువల్, మేకింగ్..ఇలా ప్రతి అంశంలో ఈ సినిమా మీకు కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్ లో మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ కనిపించవచ్చు. కానీ సినిమా చూస్తే అది ఎందుకు ఉందో తెలుస్తుంది. సెక్స్ అనే విషయం గురించి ఇప్పటికీ మనదేశంలో ఓపెన్ గా మాట్లాడుకోలేకపోతున్నాం. కానీ ఓపెన్ గా మాట్లాడుకునే మైండ్ సెట్ రావాలి. సినిమా ఔట్ పుట్ పట్ల మేము హ్యాపీగా ఉన్నాం. రేపు మూవీ చూస్తూ మీరు హ్యాపీగా ఫీలవుతారని నమ్ముతున్నాం. అన్నారు.
 
హీరో యష్ పూరి మాట్లాడుతూ - హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా "హ్యాపీ ఎండింగ్". నా ఫస్ట్ మూవీ నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా హమ్స్ టెక్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరంతా నా ఫ్యామిలీ  ట్రైలర్ చూస్తే మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సెన్సార్ అయ్యాక మాకు యు సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హర్ష్ కు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. నేను అలాంటివి నమ్మను. ఏషియన్ ఫిలింస్, శ్రేయాస్ మీడియా, మా పీఆర్ టీమ్ అందరికీ థ్యాంక్స్. మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా. మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా ఆదరిస్తారు. "హ్యాపీ ఎండింగ్" అనే సినిమాకు నాలుగు ఫిల్లర్స్ గా నిలిచారు ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. రేపు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే సక్సెస్ క్రెడిట్ వీళ్లకే ఇవ్వాలి. మీరంతా మా సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. అని అన్నారు.
 
డైరెక్టర్ కౌశిక్ భీమిడి మాట్లాడుతూ - "హ్యాపీ ఎండింగ్" ఒక హానెస్ట్ మూవీ. స్టార్ కాస్టింగ్ లేకున్నా, భారీ ప్రాజెక్ట్ కాకున్నా...మంచి సినిమా అయితే చాలు థియేటర్స్ కు వెళ్లి చూస్తాం అనుకునే ఆడియెన్స్ ను "హ్యాపీ ఎండింగ్" సంతృప్తి పరుస్తుంది. వాళ్లంతా మా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్లంతా టైమ్, హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీని చేశాం. నాకు మైథాలజీ ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మోడ్రన్ అప్రోచ్ తో చేసిన సినిమా ఇది. "హ్యాపీ ఎండింగ్" సినిమాతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. అన్నారు
 
హీరోయిన్ అపూర్వ రావ్ మాట్లాడుతూ - ఒక అబ్బాయి గురించి చెప్పే కథ "హ్యాపీ ఎండింగ్". మనకు సాధారణంగా కనిపించే విషయాలు ఈ అబ్బాయిని భయపెడుతుంటాయి. అతనో అమ్మాయిని కలుస్తాడు. ఆమే తన ప్రేయసి అవుతుంది. ఈ భయాల మధ్య ఆ అమ్మాయితో తన ప్రేమను ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ మీలో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని అనుకుంటున్నా. ఈ సినిమాలో బోల్డ్ పర్ ఫార్మెన్స్ చేయలేదు. కథే బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో...రేపు థియేటర్స్ లో మీరూ అలాగే ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. అని చెప్పింది.