గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:22 IST)

అందం - అభినయం భగవంతుడు ఇచ్చిన వరం ... మరింతగా రెచ్చిపో : చిరు విషెస్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 45వ పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా మహేశ్‌కు శుభాభినందనలను ట్విట్టర్ మాధ్యమంగా వెల్లడించారు.
 
'అందం, అభినయం మీకు భగవంతుడు ఇచ్చిన వరం. మరెన్నో మరచిపోలేని పాత్రలు మీరు చేయాలని, మీ కలలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే టూ మహేశ్. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు.
 
Dneis, ప్ర‌ముఖ ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌.. మ‌హేష్‌కి త‌న‌దైన స్టైల్‌లో బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. లాక్డౌన్ స‌మ‌యంలో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కి త‌న భార్య‌తో క‌లిసి చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ విషెస్ అందించారు. హ్యాపీ బ‌ర్త్‌డే లెజెండ్ మ‌హేష్ అంటూ వార్న‌ర్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.
 
కరోనా వ‌ల‌న క్రికెట్‌కి దూరంగా ఉంటూ ఇంటికే ప‌రిమితమైన డేవిడ్ వార్న‌ర్ సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన సినిమాల‌లోని హిట్ సాంగ్స్‌కి టిక్ టాక్ వీడియోలు చేశారు. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అలరించాయి. తెలుగులో మ‌హేష్‌, అల్లు అర్జున్ సినిమాల‌లోని సాంగ్స్‌, డైలాగ్స్‌కి వార్న‌ర్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు డేవిడ్.