సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:35 IST)

"మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో... హరిహర వీరమల్లు" తాజా అప్‌డేట్ ఇదే!

harihara veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రాల్లో "హరిహర వీరమల్లు" ఒకటి. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ టీజర్‌ను ఎపుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్... ఈ సినిమా షూటింగులకు సక్రమంగా హాజరుకాలేకపోతున్నారు. దీంతో షూటింగ్ మొదలై చాలా రోజులైనప్పటికీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
"మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..." అంటూ పవన్ కళ్యాణ్‌ ఫోటోతో ఈ పోస్టర్‌ను రూపొందించారు. 'హరిహర వీరమల్లు' సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుంటే, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలతో పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తూ, అంచనాలు భారీగా పెంచేసింది. కాగా, ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.