సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (21:35 IST)

విషమంగానే శరత్ బాబు ఆరోగ్యం - వెంటిలేటర్‌పైనే చికిత్స...

sarathbabu
నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబుకు గత కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం మరణించిన వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ బాబు ఆరోగ్యంపై ఏఐజీ ఆస్పత్రి మీడియా బులిటెన్ విడుదల చేసింది. 
 
శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటన చేసింది. ఆస్పత్రి వర్గాలు కానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ  ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు వివరాలు తెలియజేస్తుంటారని ఆ బులిటెన్‌లో పేర్కొంది.