సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:31 IST)

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ హాట్ టాపిక్స్‌లో ఇప్పుడు అర్జున్ కపూర్ మలైకా అరోరా జంట ఒకటి. వీరిద్దరూ బయట ఎక్కడ కనిపించినా వారి గురించి మీడియాలో అనేక గాసిప్స్ వస్తుంటాయి. వీరిద్దరూ రేపోమాపో పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఇందుకోసమే మలైకా అరోరా సల్మాన్ సోదరుడు అర్బైజ్ ఖాన్‌తో తెగతెంపులు చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. 
 
ఇలాంటివి వార్తలు ఎన్ని వచ్చినా ఈ జంట మాత్రం అధికారికంగా వారి బంధం గురించి బయటపెట్టలేదు. ఏప్రిల్ 19న ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు వారిద్దరూ స్పందించలేదు. ఈమధ్యే ఈ జంట మాల్దీవులకు వెళ్ళింది. కలిసి వెళ్తే దొరికిపోతామనే ఉద్దేశంతో వీరిద్దరూ జంటగా వెళ్లకుండా విడివిడిగా వెళ్లారు.
 
మాల్దీవుల్లోని బీచ్‌ల్లో తీసుకున్న ఫోటోలను ఎవరికి వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రెండు ఫోటోలను పరిశీలిస్తే ఇద్దరూ మాల్దీవుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. విడివిడిగా వెళ్లినా జనం దృష్టి నుండి పాపం తప్పించుకోలేకపోయారు. మరి పెళ్లిపై ఈ జంట ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.