శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (11:54 IST)

డాక్టర్ జీవిత రాజశేఖర్ ఇంట మరో విషాదం...

టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తల్లి చనిపోయిన బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోని విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో బుధవారం తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది

టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తల్లి చనిపోయిన బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోని విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో బుధవారం తెల్లవారుఝామున జీవిత సోదరుడు, రాజశేఖర్ బావమరిది మురళీ శ్రీనివాస్ హైదరాబాదులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
 
మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే రాజశేఖర్ అమ్మ కూడా మరణించారు. కాగా, రాజశేఖర్ నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎం’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సమయంలో కుటుంబంలో విషాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.